మాజీ డిప్యూటీ సీఎం, వైసీపీ ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ కీలక ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో జగన్ సీఎం కాకుంటే.. తాను గెలిచినా… రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఏపీలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా.. తిరిగి జగన్ సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు. సారవకోట మండలం చీడిపూడి గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తాము ఎవ్వరిపోతూ పొత్తు పెట్టుకోమని, ఒంటరిగానే 175 స్థానాల్లో పోటీచేసి, గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. తమ లాగా టీడీపీ, జనసేన పోటీ చేయగలవా? అంటూ సవాల్ విసిరారు. మూడు రాజధానుల ద్వారా అన్ని ప్రాంతాలకు మేలు జరుగుతుందని ప్రకటించారు. అందుకే వికేంద్రీకరణకు మొగ్గు చూపుతున్నామని ప్రజలకు వివరించారు.