భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో ఘనతను సొంతం చేసుకున్నది. బాహుబలి జీఎస్ఎల్వీ మార్క్-3 రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించింది. తిరుపతి జిల్లాలో ఉన్న సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి శనివారం అర్ధరాత్రి 12.07 గంటలకు జీఎస్‌ఎల్వీ-మార్క్ 3 రాకెట్ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. ఈ బాహుబలి రాకెట్ విదేశాలకు చెందిన 36 ఉపగ్రహాలను సక్సెస్‌ఫుల్‌గా నిర్దేశి కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ప్రయోగం 19 నిమిషాల్లోనే ముగిసింది. ఇస్రో వాణిజ్య విభాగమైన న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ కోసం నిర్వహించిన మొదటి వాణిజ్య ప్రయోగం ఇదే కావడం గమనార్హం.
కాగా, ప్రయోగం విజయంతం కావడంపై ఇస్రో చైర్మన్ సోమనాథ్ హర్షం వ్యక్తం చేశారు. యూకేకు చెందిన 108 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టేందుకు ఒప్పందం కుదుర్చుకున్నామని.. అందులో భాగంగానే ఇప్పుడు 36 ఉపగ్రహాలను పంపించామని తెలిపారు. ఈ ప్రయోగం తర్వాత వరుసగా రాకెట్ ప్రయోగాలు చేపడతామన్నారు. వచ్చే ఏడాది మార్చిలోపు మరో నాలుగు రాకెట్లను ప్రయోగిస్తామని చెప్పారు.
#WATCH | ISRO launches LVM3-M2/OneWeb India-1 Mission from Satish Dhawan Space Centre (SDSC) SHAR, Sriharikota
(Source: ISRO) pic.twitter.com/eBcqKrsCXn
— ANI (@ANI) October 22, 2022
ఇస్రో చేపట్టి ఎల్ వీఎం 3 రాకెట్ ప్రయోగం విజయంవంతం కావడంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. హర్షం వ్యక్తం చేశారు. గ్లోబల్ కనెక్టివిటీ కోసం ఉద్దేశించిన 36 OneWeb ఉపగ్రహాల ప్రయోగం, ఆత్మనిర్భర భారత్‌కు ఉదాహరణగా ఆయన అభివర్ణించారు. వాణిజ్య ఉపగ్రహ ప్రయోగాల్లో.. భారత్ ప్రపంచానికి పోటీదారుగా నిలిచిందని పేర్కొన్నారు. ఇస్రో బృందాన్ని అభినందిస్తున్నట్టు తెలిపారు. ఈ మేరకు ప్రధాని నరేంద్రమోదీ ట్వీట్ చేశారు.