అమెరికా అత్యవసర వీసాలపై కాన్సులేట్ కీలక సూచన

అమెరికా వెళ్లేందుకు అత్యవసర వీసాల డిమాండ్ ఎక్కువగా వుందన్నది వాస్తవమేనని, అయితే… అత్యవసర వీసాలను జారీ చేయలేమని హైదరాబాద్ లోని యూఎస్ కాన్సులేట్ ప్రకటించింది. పర్యాటకులు ఇప్పుడు అన్ని కేటగిరీల వీసాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. అయితే… దానికి పడే సమయంలో మాత్రం ఎలాంటి తేడాలు లేవని, వీసా సంబంధిత అంశాలను నివృత్తి చేసుకునేందుకు యూఎస్‌ దౌత్య వ్యవహారాల మంత్రి డాన్‌ హెఫ్లిన్‌ ఈ నెల 29న మధ్యాహ్నం 3 గంటలకు అధికారిక ఫేస్‌బుక్‌ పేజీ ద్వారా ప్రశ్నలు అడగవచ్చని పేర్కొంది.

 

అమెరికా వీసా దరఖాస్తు చేసుకున్న వారికి కొన్ని కేటగిరిల వీసాల విషయంలో ఈ ఏడాది డిసెంబర్‌ 31 వరకు ఇంటర్వ్యూలు రద్దు చేసేందుకు అమెరికా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు యూఎస్‌ విదేశాంగ శాఖ కాన్సులార్‌ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎఫ్‌, హెచ్‌ 1, హెచ్‌ 3, హెచ్‌ 4, నాన్‌ బ్లాంకెట్‌ ఎల్‌, ఎం, ఓ, పీ, క్యూ వీసాలకు దరఖాస్తు చేసుకున్న వారితో పాటు అకాడమి జే వీసా దరఖాస్తు దారులకు కూడా ఈ మినహాయింపు వర్తించనుంది. అయితే వీరు గతంలో ఏ రకమైన వీసా జారీ చేసినా, వారు తమ జాతీయత లేదా నివాస దేశం నుంచి వీసా కోసం దరఖాస్తు చేసుకుంటే మునుపటి తిరస్కరణను కలిగి ఉన్న దరఖాస్తుదారులకు ఇది వర్తించదు.

Related Posts

Latest News Updates