ఒక్క పరిశ్రమతో ఎంతో మందికి లాభం… రామ్ కో సిమెంట్ ను ప్రారంభించిన సీఎం జగన్

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నంద్యాల జిల్లాలో రామ్ కో సిమెంట్ ఫ్యాక్టరీని ప్రారంభించారు. ఈ పరిశ్రమతో 1000 మందికి ఉద్యోగాలు వస్తాయని సీఎం జగన్ ప్రకటించారు. రాష్ట్రంలో పరిశ్రమలకు అన్ని విధాలా ప్రభుత్వ సహకారం వుంటుందని హామీ ఇచ్చారు. ఒక పరిశ్రమ వస్తే.. ఎంతో మందికి లాభం జరుగుతుందని, ఎంతో మంచి జరుగుతుందని పేర్కొన్నారు. స్థానికులకు కూడా ఉద్యోగ, ఉపాధి కల్పన కలుగుతుందన్నారు.

 

రానున్న 4 సంవత్సరాల్లో 20 వేల ఉద్యోగాలు వస్తాయని ప్రకటించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీ వరుసగా 3 వ సారి మొదటి స్థానంలో వుందని సీఎం హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్షయాల వల్లే ఇది సాధ్యమైందని అన్నారు. ఇక.. సోలార్ ప్రాజెక్టుల ఏర్పాటుకు రైతులు గనక ముందుకు వస్తే.. ఎకరాకు ఏడాదికి 30 వేల లీజు చెల్లిస్తామని, 3 సంవత్సరాలకు ఓసారి 5 శాతం లీజు పెంచుతామని కీలక ప్రకటన చేశారు.

Related Posts

Latest News Updates