నూతన సీడీఎస్ గా అనిల్ చౌహాన్ నియామకం…

నూతన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ గా రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ అనిల్ చౌహాన్ ను కేంద్రం నియమించింది. ఈ మేరకు రక్షణ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. దీంతో అనిల్ చౌహాన్ దేశ రెండో సీడీఎస్ గా నియమితులయ్యారు. అనిల్ చౌహాన్ ఈస్టర్న్ కమాండ్ చీఫ్ గా 2021 మే నెలలో పదవీ విరమణ చేశారు. 40 ఏళ్ల కెరీర్ లో అనేక హోదాల్లో పనిచేశారు. 2021లో ఈస్ట్రన్ ఆర్మీ కమాండర్ ఇన్ చీఫ్‌గా ఉన్నప్పుడు ఆయన రిటైర్ అయ్యారు. అనంతరం జాతీయ భద్రతామండలి సలహాదారుడిగా కొనసాగుతున్నారు. అనిల్ చౌహన్ 1967 మే 18న జన్మించారు.

 

1981లో 11 గుర్ఖా రైఫిల్స్ లో చేరారు. 2019 సెప్టెంబర్ నుంచి ఈస్ట్రన్ ఆర్మీ కమాండ్ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టారు. రిటైర్ అయ్యే వరకు ఈ బాధ్యతల్లో కొనసాగారు. జమ్మూ కాశ్మీర్ సహా ఈశాన్య ప్రాంతంలో తిరుగుబాటు గ్రూపులను నిరోధించడంలో ఆయనకు విశేష అనుభవం ఉంది. ఇక.. తన సేవలకు గాను కేంద్రం పరమ విశిష్ట సేవా పతకం, ఉత్తమ యుద్ధ సేవా పతకం, అతి విశిష్ట సేవా పతకాలతో సత్కరించింది.

Related Posts

Latest News Updates