బ్రహ్మోత్సవాల సమయంలో తిరుమల కొండపైకి కేవలం 12 వేల వాహనాలకే అనుమతి : టీటీడీ

గత రెండు సంవత్సరాలుగా కరోనా కారణంగా టీటీడీ బ్రహ్మోత్సవాలు నిర్వహించలేదు. ఈ సారి అంగరంగ వైభవంగా నిర్వహించాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 27 నుంచి అక్టోబర్ 5 వరకూ బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. భక్తులు కూడా ఈసారి అధిక సంఖ్యలో తరలివస్తారని టీటీడీ అంచనా వేసింది. అందుకు తగ్గట్లుగానే అన్ని రకాల ఏర్పాట్లు చేస్తోంది. అయితే.. భక్తుల భద్రత విషయంలో టీటీడీ మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. సుమారు 6 వేల మంది పోలీసులతో భద్రత ఏర్పాట్లు చేస్తోంది.

 

తిరుమల కొండపైకి 12 వేల వాహనాలను మాత్రమే అనుమతించాలని టీటీడీ నిర్ణయించుకుంది. భక్తులు వాహనాలను తిరుపతిలోని పార్కింగ్ ప్రాంతాల్లోనే పెట్టేయాలని, అక్కడి నుంచి ఉచిత బస్సుల్లో కొండపైకి చేరుకోవాలని టీటీడీ సూచించింది. ఈ నెల 30 మధ్యాహ్నం నుంచి వచ్చే నెల 2 వరకూ ద్విచక్ర వాహనాలను ఘాట్ రోడ్డులో అనుమతించమని టీటీడీ ప్రకటించింది.

Related Posts

Latest News Updates