హిజాబ్ ధరించనందుకు ఇంటర్వ్యూ ఇవ్వని ఇరాన్ అధ్యక్షుడు

హిజాబ్ పై వ్యతిరేకత ఇరాన్ లో ఇంకా కొనసాగుతూనే వుంది. హిజాబ్ పేరుతో ప్రభుత్వం నియంతలా వ్యవహరిస్తోందంటూ హిజాబ్ విప్పేసి, జట్టు కత్తిరించుకొని మహిళలు తీవ్ర నిరసన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తాజాగా… హిజాబ్ సెగ ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీకి తగిలింది. ఐక్యరాజ్య సమితి సాధారణ అసెంబ్లీలో ప్రసంగించేందుకు ఆయన న్యూయార్క్ కు వచ్చారు. ఈ సందర్భంగా సీఎన్ఎన్ చీఫ్, యాంకర్ క్రిస్టియాన అమన్ పూర్ కు ఇంటర్వ్యూ ఇచ్చేందుకు ఆయన నిరాకరించారు. హిజాబ్ ధరిస్తేనే ఇంటర్వ్యూ ఇస్తానని ఆయన పేర్కొన్నారు. తాను హిజాబ్ ధరించనని క్రిస్టియానా తెగేసి చెప్పారు. దీంతో ఆయన ఇంటర్వ్యూ ఇవ్వకుండానే వెళ్లిపోయారు.

 

 

ఇంటర్వ్యూకు ముందు జుట్టును హిజాబ్ తో కప్పి వుంచుకోవాలని ఇరాన్ అధ్యక్షుడి సహాయకురాలు క్రిస్టియానాకు సూచించారు. తాను హిజాబ్ ధరించనని, తెగేసి చెప్పారు. దీంతో అధ్యక్షుడు ఇంటర్వ్యూ ఇవ్వలేదు. దీంతో క్రిస్టియానా ట్వీట్ చేశారు. ట్వీట్ తో పాటు ఇరాన్ అధ్యక్షుడు కోసం ఉంచిన ఖాళీ కుర్చీ ముందు హిజాబ్ లేకుండా కూర్చున్న చిత్రాన్ని పోస్ట్ చేసింది. న్ను హిజాబ్ ధరించాలని కోరితే దాన్ని మర్యాదగా తిరస్కరించాను. మేం న్యూయార్క్‌లో ఉన్నాం, ఇక్కడ హిజాబ్ కు సంబంధించి ఎలాంటి చట్టం లేదా సంప్రదాయం లేదు’’ అని బ్రిటిష్-ఇరానియన్ జర్నలిస్ట్ ట్విట్టర్‌లో రాశారు. నేను ఇరాన్ వెలుపల వారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు మునుపటి ఇరాన్ అధ్యక్షులెవరూ హిజాబ్ ధరించాల్సిన అవసరం లేదనే విషయాన్ని తాను ఎత్తి చూపానని క్రిస్టియానా చెప్పారు.

 

Related Posts

Latest News Updates