అబుదాబిలో తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేశారు. తెలంగాణ విమోచన ప్రాముఖ్యత గురించి పలువురు వక్తలు వివరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్ సభ్యులు రాజు శ్రీనివాస్‌రావు, చరణ్, రంజిత్, శ్రీనివాస్, శ్రీనివాస్‌రెడ్డి, నారాయణరెడ్డి, జగదీశ్, బాబు, సంతోష్, సన్ని, గోపాల్, గంగారెడ్డి, వంశీక్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.