పుతిన్ అనుకున్న లక్ష్యాన్ని సాధించలేరు : అమెరికా

వరసగా తగులుతున్న ఎదురుదెబ్బలు, తరిగిపోతున్న వనరుల నేపథ్యంలో ఉక్రెయిన్‌పై అనుకున్న లక్ష్యాన్ని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ సాధించడం కష్టమేనని అమెరికా రక్షణరంగ నిఘా సంస్థ అధిపతి లెఫ్టినెంట్‌ జనరల్‌ స్కాట్‌ బెరియర్‌ పేర్కొన్నారు. వాషింగ్టన్‌ వెలుపల మేరీలాండ్‌లో జరిగిన జాతీయ భద్రత సదస్సులో ఆయన ప్రసంగించారు. యుద్ధం మొదలు పెట్టిన తొలినాళ్లలో అనుకున్నదానిని చేసే పరిస్థితిలో పుతిన్‌ ఇప్పుడు లేరని బెరియర్‌ తెలిపారు. లక్ష్యాన్ని రష్యా సవరించుకోక తప్పదని అభిప్రాయపడ్డారు. ఉక్రెయిన్‌లో పలు ప్రాంతాల నుంచి పుతిన్‌ సేనలు వెనక్కి తగ్గాల్సి వస్తున్న పరిస్థితుల్లో ఈ వ్యాఖ్యలు చేశారు.

Related Posts