బాలభారతి పాఠశాలకు కర్నూలు ఎన్ఆర్ఐ ఫౌండేషన్ రూ.10 లక్షల విరాళం

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలంలోని పొదుపు లక్ష్మి ఐక్యసంఘం నిర్వహిస్తున్న బాలభారతి పాఠశాలకు రూ.10 లక్షల విరాళాన్ని కర్నూలు ఎన్‌ఆర్‌ఐ ఫౌండేషన్‌ అందించింది. ప్రముఖ గాయని సునీత ఈ చెక్కును పాఠశాల కమిటీ అధ్యక్షురాలు విజయలక్ష్మికి సెప్టెంబర్‌ 17న అందజేశారు. అక్కడి విద్యార్థుల చదువుకు ఎలాంటి ఆటంకాలు లేకుండా విద్యనందించాలనే లక్ష్యంతో ఈ విరాళాన్ని అందజేస్తున్నట్లు కర్నూలు ఎన్‌ఆర్‌ఐ ఫౌండేషన్‌ చైర్మన్‌ పొట్లూరి రవి తెలిపారు. లాభాపేక్ష లేకుండా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఉత్తమ విద్యను అందిస్తున్న బాలభారతి పాఠశాలకు భవిష్యత్తులో కూడా తమవంతు సహకారం అందజేస్తామన్నారు.   ఈ కార్యక్రమంలో పాఠశాల వైస్‌ ప్రిన్సిపాల్‌ సత్య, పొదుప ులక్ష్మి ఐక్యసంఘంకు చెందిన పలువురు మహిళలు, బాలభారతి పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Related Posts

Latest News Updates

నవంబర్ 9న హార్ట్‌ల్యాండ్ ఆఫ్ ఇండియా ల‌క్నోలో గ్రాండ్ లెవ‌ల్లో గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్, దిల్ రాజు కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న భారీ చిత్రం ‘గేమ్ చేంజర్’ టీజర్ రిలీజ్‌కు రంగం సిద్దం