వైసీపీ నేత లక్ష్మీపార్వతికి సుప్రీంలో ఎదురు దెబ్బ తగిలింది. టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఆస్తులపై విచారణ జరపాలంటూ ఆమె సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీం కొట్టేసింది. ఒకరి ఆస్తులు తెలుసుకోవడానికి మీరెవరని విచారణ సందర్భంగా సుప్రీం ప్రశ్నించింది. తాను ఎన్టీఆర్ సతీమణి అని లక్ష్మిపార్వతి బదులివ్వగా…. ఆ హోదా అదనపు అర్హత అవుతుందా? అంటూ ప్రశ్నించారు.
ఇలా వాదోపవాదాలు సాగిన తర్వాత ఈ పిటిషన్ లో విచారించదగ్గ అంశాలేవీ లేవని సుప్రీం ఈ పిటిషన్ ను తోసిపుచ్చింది. అయితే గతంలో కూడా చంద్రబాబు ఆస్తులపై లక్ష్మిపార్వతి ఏసీబీ దర్యాప్తు కోరుతూ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాలు చేయగా… కోర్టు తోసిపుచ్చింది. ఆ తర్వాత ఆమె హైకోర్టుకెక్కారు. హైకోర్టు కూడా నిరాకరించడంతో చివరగా లక్ష్మిపార్వతి సుప్రీం మెట్లెక్కారు.