ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదిగిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇది అంత ఆషామాషీ విషయం కాదని, ప్రతి భారతీయుడూ గర్వించదగ్గ విషయమని పేర్కొన్నారు. గుజరాత్ సూరత్ లోని ఒల్పాడ్ లో జరిగిన మెడికల్ క్యాంప్ లో వివిధ లబ్ధిదారులను ఉద్దేశించి మోదీ వర్చువల్ గా ప్రసంగించారు. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదిగిందని, ఈ ఒరవడిని ఇలాగే కొనసాగించాలని ఆకాంక్షించారు. ఈ విజయంతో మరింత కష్టపడి, మరిన్ని విజయ సోపానాలను చేరుకోగలమన్న నమ్మకం ఏర్పడిందన్నారు. ఇక… రైతులు ప్రక్రుతి సేద్యం వైపు ఆలోచించాలని కోరారు. ఈ ప్రక్రుతి సేద్యంతో తక్కువ ఖర్చు, ఎక్కువ లాభాలున్నాయని వివరించారు.