బ్రిటన్ ను అత్యధిక కాలం పరిపాలించిన రాణి ఎలిజిబెత్ -2 (96) స్కాట్ లాండ్ లోని బర్మోరల్ కేజిల్ లో కన్నుమూశారు. రాణి ప్రశాంతంగానే తుది శ్వాస విడిచారని ప్యాలెస్ అధికారులు ప్రకటించారు. అయితే… గురువారం ఉదయం నుంచే ఆమె ఆరోగ్యం క్షీణిస్తోందని వైద్యులు తీవ్రంగా ఆందోళన చెందారు. దీంతో ఆమె కుటుంబీకులందరూ ప్యాలెస్ కు చేుకున్నారు. పెద్ద సంఖ్యలో లండన్ వాసులు, ఇతరులు కూడా ప్యాలెస్ కు చేరుకున్నారు.
1952 లో 25 సంవత్సరాలకే బ్రిటన్ రాణి కిరీటం ధరించారు. ఎలిజిబెత్ గా అత్యధికాలం కొనసాగారు. కొన్ని రోజులుగా ఆమె తీవ్ర అనారోగ్యంతో వున్నారు. ప్రయాణాలను బాగా తగ్గించుకుంటూ, దైనందిన కార్యక్రమాలను కూడా తగ్గించుకున్నారు. చివరికి, బ్రిటన్ ప్రధానిగా లిజ్ ట్రస్ ప్రమాణ స్వీకారానికి కూడా ఆమె గైర్హాజర్ అయ్యారు. ఆ సమయం నుంచే ఆమె ఆరోగ్య పరిస్థితులపై అనుమాలు తలెత్తాయి. రాణి మరణంతో ఆమె పెద్ద కుమారుడు ఛార్లెస్ నూతన రాజుగా, 14 వ కామన్ వెల్త్ దేశాలకు దేశాధినేతగా వ్యవహరిస్తున్నారు.
రాణి ఎలిజబెత్ మృతిపట్ల పీఎం మోడీ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కాలపు గొప్ప నాయకురాలిగా రాణి ఎలిజబెత్ నిలిచిపోతారని మోడీ ప్రశంసించారు. బ్రిటన్ కు సమర్థమైన, స్ఫూర్తివంతమైన నాయకత్వాన్ని రాణి ఎలిజబెత్ అందించారని మోడీ అన్నారు.
రాజ కుటుంబం తరపున నూతన రాజు ఛార్లెస్ ఓ ప్రకటన కూడా విడుదల చేశారు. నా ప్రియమైన తల్లి, హర్ మెజెస్టీ ది క్వీన్ మరణం నాకు, మా కుటుంబీకులకు తీవ్ర వేదన కలిగిస్తోంది. ఆమె మరణంపై ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నా అని నూతన రాజు ఛార్లెస్ ఓ ప్రకటన విడుదల చేశారు.