మునుగోడు అభ్యర్థిని అందరి కంటే ముందే కాంగ్రెస్ ప్రకటించింది. పాల్వాయి స్రవంతిని మునుగోడు అభ్యర్థిగా ప్రకటిస్తూ కాంగ్రెస్ అధిష్ఠానం ప్రకటన విడుదల చేసింది. మునుగోడు బైపోల్ కు సంబంధించి నలుగురు తీవ్రంగా పోటీపడ్డారు. పాల్వాయి స్రవంతి, కృష్ణారెడ్డి, పల్లె రవి, కైలాస్ నేత తీవ్రంగా ప్రయత్నాలు చేశారు. చివరికి పీసీసీ ఈ నలుగురి పేర్లను జతచేసి, అధిష్ఠానానికి రిపోర్టు పంపింది. చివరికి అధిష్ఠానం పాల్వాయి స్రవంతి పేరును ఫైనల్ చేసింది.

 

మునుగోడు బై పోల్ కు పార్టీ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి పేరును కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఖరారు చేశారు’’ అని తెలుపుతూ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ ముకుల్ వాస్నిక్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఇక… దీనిపై పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జీ మాణిక్కం ఠాగూర్ కూడా ట్వీట్ చేశారు. సోనియా గాంధీ తీసుకునే ఏ నిర్ణయమైనా పార్టీ బలోపేతానికేనని, అదే స్ఫూర్తితో మునుగోడులో శ్రేణులు ముందుకు సాగాలన్నారు. మునుగోడులో మళ్లీ గెలవాలని ఠాగూర్ ట్వీట్ చేశారు.

 

https://twitter.com/manickamtagore/status/1568142841725202435?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1568142841725202435%7Ctwgr%5E216751c7da56984e5287dd82e223e774f25c3ee2%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.v6velugu.com%2Fpalvai-sravanthi-is-the-congress-party-candidate-for-munugode-bye-poll