టెలికాం రంగంలో కొత్త శకం… ‘5జీ ‘సేవలను ప్రారంభించిన ప్రధాని మోదీ

భారత దేశ టెలికం రంగంలో కొత్త శకం ప్రారంభమైంది. దేశంలో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఢిల్లీ ప్రగతి మైదాన్ లో ప్రధాని నరేంద్ర మోదీ 5 జీ సేవలను అధికారికంగా ప్రారంభించారు. అలాగే 6 వ ఇండియా మొబైల్ కాంగ్రెస్ ను కూడా మోదీ ప్రారంభించారు. ప్రారంభించిన తర్వాత 5జీ సేవలకు సంబంధించిన ప్రదర్శనను మోదీ ఆద్యంతమూ తిలకించారు.

 

5జీ సేవలకు సంబంధించిన డెమోను రిలయన్స్ జియో విభాగం చైర్మన్ ఆకాశ్ అంబానీ ప్రధానికి వివరించారు. ఆ తర్వాత 5 జీ సేవలను ప్రధాని మోదీ స్వయంగా పరిశీలించారు. తొలిదశలో ముంబై, ఢిల్లీ, బెంగళూరు, కోల్ కతా, హైదరాబాద్, పునె, అహ్మదాబాద్, చండీగడ్, గాంధీనగర్, గురుగ్రాం, లక్నోలో మాత్రమే 5 జీ సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. రెండేళ్లలో దేశమంతటా 5 జీ సేవలు విస్తరించనున్నారు.

 

 

మరో వైపు ఈ రోజు చాలా ప్రముఖమైన రోజు అని ప్రముఖ పారిశ్రామికేవత్త భారతీ ఎంటర్ ప్రైజెస్ చైర్మన్ సునీల్ మిట్టల్ హర్షం వ్యక్తం చేశారు. దేశంలో కొత్త శకం ప్రారంభమైందన్నారు. 75 సంవత్సరాల స్వాతంత్రోద్యమ ఉత్సవాలు జరిగిన కొద్ది రోజులకే ప్రారంభం కావడం ఎంతో ముదావహం అన్నారు. 5 జీ సేవల ప్రారంభం ద్వారా దేశానికి కొత్త దిశ, కొత్త శక్తి, కొత్త అవకాశాలు వస్తాయని సునీల్ మిట్టల్ అన్నారు.

Related Posts