అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాగా మరోసారి ముకుల్ రోహత్గీ

అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాగా సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గియే మళ్లీ నియమితులయ్యారు. అక్టోబర్ 1 నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం ఏజీగా కేకే వేణుగోపాల్ పదవీ విరమణ తర్వాత రోహత్గి పదవీ బాధ్యతలు చేపడతారు. అయితే.. రోహత్గి గతంలో ఏజీగా పనిచేశారు. 2017 లో ఈ బాధ్యతల నుంచి వైదొలగడంతో వేణుగోపాల్ ను ప్రభుత్వం నియమించింది. ఈ యేడాది సెప్టెంబర్ 30 తో వేణుగోపాల్ పదవీ కాలం ముగియనుంది. అయితే… 2020 లోనే వేణుగోపాల్ మూడేళ్ల పదవీ కాలం ముగిసింది. తనకు 89 సంవత్సరాలని, ఇక బాధ్యతలు వద్దని కేంద్రాన్ని కోరినా…. వేణుగోపాల్ నే కొనసాగమని కేంద్రం కోరడంతో ఆయన పదవిలో కొనసాగుతున్నారు.

Related Posts

Latest News Updates