ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాఠశాల విద్య, నాడు- నేడు, తరగతి గదుల డిజిటలైజేషన్ పై అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో ఉన్నతాధికారులు, మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ అధికారులకు కొన్ని సూచనలు చేశారు. నాడు నేడు ద్వారా పనులు పూర్తైన బడుళ్లో నిరంతరం ఆడిట్ నిర్వహించాలని సీఎం సూచించారు. సూళ్లల్లో కల్పించిన సౌకర్యాలు బాగున్నాయా? లేదా? అన్నది కూడా పరిశీలించాలని, అవసరమైన పనులు వెంటనే చేయాలని సూచించారు. నెలకోసారి తనిఖీ చేయాలని, సూళ్ల మెయింటేనెన్స్ ఫండ్ ను వినియోగించుకొని నిర్వహణలో లోపాలు లేకుండా చూడాలని కోరారు. పాఠశాలల్లో ఎలాంటి సమస్యలున్నా చెప్పేందుకు ఓ టోల్ ఫ్రీ నెంబర్ ను డిస్ ప్లే బోర్డుల్లో వుంచాలన్నారు.
దశలవారీగా తరగతి గదుల్లో స్మార్ట్ టీవీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందుకు 52 కోట్లకు పైగా ఖర్చవుతుందని ప్రభుత్వం ఓ అంచనాకు వచ్చింది. 72 వేల స్మార్ట్ టీవీలు అవసరమవుతాయని, వాటిని సమకూర్చుకోవడంపై అధ్యయనం చేయాలన్నారు. వచ్చే యేడాది మార్చి నాటికి తగతి గదుల డిజిటలైజేషన్ పూర్తి చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. నవంబరులో టెండర్లు పిలవాలని అధికారులకు సూచించారు.
ఇక… అన్ని స్కూళ్లల్లో ఇంటర్నెట్ సదుపాయం వుండాలని సీఎం జగన్ సూచించారు. డిజిటల్ లైబర్రీతో పాటు గ్రామ సచివాలయం, ఆర్బీకేలను అందుబాటులోకి తేవాలన్నారు. టీచర్లకు, 8 వ తగతి విద్యార్థులకు ట్యాబ్ ల పంపిణీ కూడా చేయాలన్నారు. ట్యాబ్ ల్లో బైజూస్ కంటెంట్ అపలోడ్ చేసే ఇవ్వాలని సీఎం సూచించారు.