కొత్త‌గా నిర్మిస్తున్న పార్ల‌మెంట్ భ‌వ‌నానికి అంబేద్క‌ర్ పేరు పెట్టాల‌ని మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. దీనిపై తీర్మానం చేస్తూ ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో ఆయ‌న మాట్లాడారు. అంబేద్క‌ర్ రాసిన రాజ్యాంగం వ‌ల్లే తెలంగాణ వ‌చ్చింద‌న్నారు. అంబేద్క‌ర్ చూపిన బాట‌లోనే తాము న‌డుస్తున్నామ‌ని తెలిపారు. స్వేచ్ఛ‌, సమాన‌త్వం కోరిన వ్య‌క్తి అంబేద్క‌ర్ అన్నారు. అంబేద్క‌ర్ త‌త్వాన్ని టీఆర్ఎస్ ఆచ‌ర‌ణ‌లో చూపింద‌ని మంత్రి తెలిపారు.

 

అంబేద్క‌ర్ ల‌క్ష్యం స‌మాన‌త్వం అన్నారు. అంబేద్క‌ర్ చూపిన బాట‌లోనే తాము న‌డుస్తున్న‌ట్లు మంత్రి స్ప‌ష్టం చేశారు. భాషా ఆధిప‌త్యాన్ని, ప్రాంతీయ ఆధిప‌త్యాన్ని అంబేద్క‌ర్‌ వ్య‌తిరేకించిన‌ట్లు మంత్రి తెలిపారు. భార‌త ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ‌కు ప్ర‌తీక పార్ల‌మెంట్‌, టెంపుల్ ఆఫ్ డెమాక్ర‌సీకి పేరు పెట్ట‌డానికి ఇంత‌కు మించిన వ్య‌క్తి లేరు కాబ‌ట్టి.. అందుకే అంబేద్క‌ర్ పేరును పెట్టాల‌ని కేంద్ర ప్ర‌భుత్వాన్ని మంత్రి కేటీఆర్ త‌న తీర్మానంలో కోరారు. మరోవైపు ఇదే అంశంపై శాసన మండలిలోనూ ఏకగ్రీవ తీర్మానం చేశారు.