ముగిసిన ములాయం అంత్యక్రియలు.. అంతిమ సంస్కారాలు నిర్వహించిన అఖిలేశ్

సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ అధికారిక లాంఛనాల మధ్య ముగిశాయి. తన కుమారుడు, సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ములాయం చితికి నిప్పంటించారు. ములాయంను కడసారి చూసేందుకు అభిమానులు, నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. లక్షకు పైగా అభిమానులు వచ్చారు. దీంతో ములాయం స్వగ్రామం సఫై మొత్తం ప్రజలు, అభిమానులు, నేతలతో నిండిపోయింది.

 

 

మరో వైపు ములాయం భౌతిక కాయానికి తెలుగు రాష్ట్రాల నుంచి చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం కేసీఆర్ నివాళులు అర్పించి, అంత్యక్రియల్లో పాల్గొన్నారు. వీరితో పాటు ప్రధాని మోదీ అంత్యక్రియలకు హాజరవుతారని మొదట్లో అనుకున్నా… గుజరాత్ పర్యటన షెడ్యూల్ వల్ల హాజరు కాలేకపోయారు. ప్రధాని మోదీ పక్షాన రక్షణ మంత్రి రాజ్ నాథ్ అంత్యక్రియలకు హాజరయ్యారు. ములాయంతో తమ అనుబంధం చాలా సుదీర్ఘమైందన్నారు. భారత రాజకీయాల్లో ములాయం పాత్ర చాలా వుందన్నారు.

Related Posts