కేరళ బంద్ కు పిలుపునిచ్చిన పీఎఫ్ఐ… తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కేరళ హైకోర్టు

దేశంలో ఎన్ఐఏ దాడులను నిరసిస్తూ కేరళలో పీఎఫ్ఐ బంద్ కు పిలుపునిచ్చింది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ బంద్ కొనసాగుతుందని ప్రకటించింది. అయితే.. అలప్పుజా, కోజికోడ్, వయనాడ్, కొల్లాం జిల్లాల్లో ఆ పార్టీ హింసాత్మక దాడులకు దిగింది. బస్సులు, ఆటోలపై సంస్థ సభ్యులు దాడికి దిగారు. పోలీసులపై కూడా దాడి చేశారు. ఈ ఆందోళనకారుల దాడిలో కొల్లాంలో ఇద్దరు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. మరోవైపు బంద్ కు పిలుపునిచ్చిన పీఎఫ్ఐ పై కేరళ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

 

తమ అనుమతి లేకుండా ఎలా బంద్ కు పిలుపునిస్తారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బంద్ విషయాన్ని సుమోటో కేసుగా స్వీకరించింది హైకోర్టు. మరోవైపు పీఎఫ్ఐ సభ్యులు హింసాత్మక ఆందోళనలు చేయడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. కేరళలోని అన్ని జిల్లాల్లో భద్రతను పెంచారు. ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. మరోవైపు ఎన్ఐఏ జరిపిన దాడుల్లో 22 మంది పీఎఫ్ఐ కార్యకర్తలు అరెస్ట్ అయ్యారు.

Related Posts