నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ తెలంగాణ కాంగ్రెస్ నేతలకు నోటీసులు పంపింది. మాజీ మంత్రులు గీతారెడ్డి, సుదర్శన్ రెడ్డితో పాటు అంజన్ కుమార్ యాదవ్, షబ్బీర్ అలీ, రేణుకా చౌదరీకి ఈడీ నోటీసులు పంపింది. నేషనల్ హెరాల్డ్ విషయంలో వచ్చే నెల 10 న ఢిల్లీలో విచారణకు హాజరవ్వాలని ఆదేశించింది. నేషనల్ హెరాల్డ్ ఇష్యూకు సంబంధించిన కంపెనీలకు వీరు డబ్బులను ట్రాన్స్ఫర్ చేశారని ఈడీ వర్గాలు చెబుతున్నాయి. అయితే.. ఈడీ నుంచి తమకు ఎలాంటి నోటీసులు కూడా రాలేదని నేతలు చెబుతున్నారు. నేషనల్ హెరాల్డ్ అవకతవకలపై ఈడీ ఇప్పటికే సోనియా, రాహుల్ ను ప్రశ్నించిన విషయం తెలిసిందే.