వెంటనే ఉక్రెయిన్ ను విడిచి వెళ్లండి.. భారతీయులకు ఎంబసీ హెచ్చరికలు

ఉక్రెయిన్ పై రష్యా మళ్లీ దాడులను తీవ్రతరం చేసింది. క్షిపణులు, డ్రోన్లతో ఉక్రెయిన్ లోని పలు నగరాలపై విరుచుకుపడుతూ, విధ్వంసం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ లో వుండే భారతీయులకు భారత ఎంబసీ కీలక సూచన చేసింది. అక్కడ ఎవరైనా భారతీయులు వుంటే.. వీలైనంత తొందరగా దేశాన్ని విడిచి వెళ్లాలని హెచ్చరికలు జారీ చేసింది. ఉక్రెయిన్ లో శాంతి భద్రతలు మళ్లీ క్షీణిస్తున్నాయని, దాడులు విపరీతంగా పెరుగుతున్నాయని పేర్కొంది. అందుకే భారతీయులు ఎవ్వరూ ఉక్రెయిన్ కు రావొద్దని, అలాగే.. అక్కడ వున్న వారు వెంటనే ఆ ప్రదేశాన్ని విడిచి… అందుబాటులో వున్న మార్గాల ద్వారా దేశాన్ని విడిచి వెళ్లాలని స్పష్టం చేసింది.

 

ఉక్రెయిన్ లోని విద్యుత్, నీటి వనరులే లక్ష్యంగా రష్యా వైమానిక దాడులను చేస్తోంది. సైనిక స్థావరాలు, పరిశ్రమలు, ఝిటోమిర్ పై దాడుల నేపథ్యంలో నగరమంతా విద్యుత్, నీటి సరఫరాతో నిలిచిపోయింది. ఇంధనం డిపో కూడా ధ్వంసమైపోయింది. యుద్ధంలో సైనిక ఓటమిని రష్యా తట్టుకోలేకపోయిందని, ఎందుకిత ఉగ్రరూపం? అంటూ జెలెన్ స్కీ ప్రశ్నించారు.

Related Posts

Latest News Updates