హిందూ దేవతలపై బిహార్ బీజేపీ ఎమ్మెల్యే లాలన్ పాశ్వాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిందువుల విశ్వాసాలను తప్పుపడుతూ వ్యాఖ్యలు చేశారు. దీపావళి వేళ లక్ష్మీదేవిని ఎందుకు పూజిస్తారని ఆయన ప్రశ్నించారు. లక్ష్మీదేవిని మాత్రమే పూజిస్తే డబ్బు వస్తుందని అనుకుంటే, అప్పుడు ముస్లిం మతస్థుల్లో బిలియనీర్లు, ట్రిలియనీర్లు ఉండేవారు కాదన్నారు. ముస్లింలు లక్ష్మీదేవిని పూజించరని, మరి వాళ్లు సంపన్నులు కాలేదా అని ఆయన అడిగారు. సరస్వతీ దేవిని కూడా ముస్లింలు పూజించరు అని, మరి ఆ ముస్లింలలో పండితులు లేరా అని ఎమ్మెల్యే లాలన్ ప్రశ్నించారు. వాళ్లలో ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు లేరా అని ఆయన అడిగారు.
ఆత్మ, పరమాత్మ అనేది కేవలం ప్రజల నమ్మకం మాత్రమే అని ఎమ్మెల్యే లాలన్ తెలిపారు.మీరు నమ్మితే అదే దేవుడు అని, లేదంటే అదో రాయి ప్రతిమ అవుతుందని, దేవుళ్లు..దేవతల్ని నమ్మడం మనపై ఆధారపడి ఉందని, శాస్త్రీయ పద్ధతిలో ప్రతిదాన్ని ఆలోచించి, నిర్ణయానికి రావాలన్నారు. భజరంగభళీ మహా శక్తి సంపన్నుడని నమ్ముతారని, కానీ ముస్లింలు, క్రిస్టియన్లు భజరంగభళీని పూచించరని, మరి వాళ్లు శక్తివంతులు కాదా అని ఎమ్మెల్యే లాలన్ ప్రశ్నించారు.