మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ చిత్రం ఈ దసరాకి ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. తమిళ్ డైరెక్టర్ మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నయనతార, సత్యదేవ్‌లు కీలక పాత్రలు పోషించారు. సినిమా విడుదలైన రోజు తొలి షో నుంచే హిట్ టాక్ తెచ్చుకున్న గాడ్ ఫాదర్, బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుందా లేక నిర్మాతలు, బయ్యర్లకు నష్టాలను మిగల్చ నుందా.. ఇప్పటి వరకు గాడ్ ఫాదర్ ఎంత కలెక్ట్ చేసిందో చూద్దాం టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, రీమేక్ చిత్రాల స్పెషలిస్ట్ డైరెక్టర్ మోహన్ రాజా కాంబినేషన్‌లో తెరకెక్కిన క్రేజీ చిత్రం గాడ్ ఫాదర్. దసర కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తొలి రోజు నుంచే పాజిటీవ్ టాక్ దక్కించుకుంది. మరి పాజిటీవ్ టాక్ దక్కించుకున్న గాడ్ ఫాదర్ కలెక్షన్స్ విషయంలో మాత్రం వెనకబడిందని మూవీ క్రిటిక్స్ అభిప్రాయపడుతున్నారు. గాడ్ ఫాదర్ తొలిరోజు 38 కోట్ల కలెక్షన్స్ కొల్లగొట్టిందని చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ క్రమంలో వారంలో రోజుల్లోనే ఈ చిత్రం 100 కోట్లు క్రాస్ చేస్తుందని గాడ్ ఫాదర్ యూనిట్ అంచనావేశారు. అయితే అసలు రియాలిటీలోకి వెళితే మాత్రం కలెక్షన్స్ విషయంలో గాడ్ ఫాదర్ మేకర్స్ అంచనాలు రివర్స్ అవుతున్నాయి. ముఖ్యంగా నైజాంలో గాడ్ ఫాదర్ దాదాపు 22 కోట్లు బిజినెస్ చేసిందని సమాచారం. అయితే ఇప్పటి వరకు నైజాంలో గాడ్ ఫాదర్ 15 కోట్లు రాబట్టలేకపోయిందని లెక్కులు చెబుతున్నాయి. ఈ క్రమంలో లాంగ్ రన్‌లో గాడ్ ఫాదర్ 20 కోట్ల మార్క్ దాటడం కష్టముంటున్నారు ట్రేడ్ పండితులు. దీంతో నైజాంలో బయ్యర్స్‌కు రెండు నుంచి మూడున్నర కోట్ల మేర నష్టం తప్పకపోవచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు. మెగాస్టార్ మానియాతో నైజాంలో 30 కోట్ల టార్గెట్‌తో రిలీజ్ అయిన గాడ్ ఫాదర్, ఇప్పుడు కనీసం 15 కోట్లు అయినా వసూలు చేస్తుందా అనేది ఇప్పుడు బయ్యర్లకు టెన్షన్ పట్టుకుంది. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 103 నుంచి 104 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన గాడ్ ఫాదర్, తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు మొత్తం కలిపి 67.7 కోట్ల గ్రాస్‌ను కలెక్ట్ చేసింది. వర్కింగ్ డేస్ కావడంతో 7వ రోజు ప్రపంచ వ్యాప్తంగా గాడ్ ఫాదర్ దాదాపు 4 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో బయ్యర్లకు టెన్షన్ పట్టుకుంది. మరి సెకండ్ వీక్‌లో గాడ్ ఫాదర్ ఎంత కలెక్ట్ చేస్తుందనేది చూడాలి. ఏది ఏమైనా గాడ్ ఫాదర్ బయ్యర్లకు లాభాల కంటే నష్టాల్నే మిగిల్చే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.