ఇటలీ ప్రధాని పీఠాన్ని కైవసం చేసుకున్న మహిళ… మొట్టమొదటి రైట్ వింగ్ ప్రభుత్వమిదే

ఇటలీ ప్రధాని పీఠాన్ని మొదటి సారిగా ఓ మహిళ అధిష్ఠించనున్నారు. నేషనలిస్ట్ బ్రదర్స్ ఆఫ్ ఇటలీ పార్టీకి చెందిన అధినేత్రి జార్జియా మెలోని (45) ఎన్నికల్లో విజయం సాధించారు. తుది ఫలితాల్లో ఈమె సారథ్యంలోని కూటమి 43 శాతానికి పైగా ఓట్లు సాధించి, విజయదుందుభి మోగించింది. మ్యాజిక్ ఫిగర్ 104 కాగా ఆ కూటమికి 114 సీట్లు దక్కనున్నాయి. దీంతో ఆమె ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు మరో వారం పట్టవచ్చని, మెలోనీ ప్రధాని హోదాలో తొలి పార్లమెంట్ అక్టోబర్ 13న మొదటిసారి సమావేశమవుతుందని అధికారవర్గాలు తెలిపాయి.

 

రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇటలీకి ఓ మహిళ ప్రధాని కావడం ఇదే మొట్ట మొదటి సారి. అంతేకాకుండా రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇటలీలో ఏర్పడ్డ అతివాద ప్రభుత్వం కూడా ఇదేనని పరిశీలకులు పేర్కొంటున్నారు. ఇక… ఈమె ఓ సంచలన నినాదాన్ని తెరపైకి తెచ్చి, ప్రజలను ఎంతో ఆకర్షించారు. గాడ్ ఫాదర్ ల్యాండ్ ఆఫ్ ఫ్యామిలీ అన్న నినాదంతో ఆకర్షించారు. యూరోప్‌లోని రైట్ వింగ్ నేత‌లంద‌రూ మెలోని విక్ట‌రీని మెచ్చుకుంటున్నారు.

Related Posts

Latest News Updates

దిల్ రాజు ప్రెజెంట్స్, విక్టరీ వెంకటేష్, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్, అనిల్ రావిపూడి, శిరీష్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ‘సంక్రాంతికి వస్తున్నాం’- ఆర్‌ఎఫ్‌సీలో సంక్రాంతి స్పెషల్ సాంగ్ షూటింగ్