పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ బీజేపీలో చేరుతున్నారు. ఈ నెల 19 న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆయన బీజేపీ కండువా కప్పుకోనున్నారు. అలాగే తన పార్టీ పంజాబ్ లోక్ కాంగ్రెస్ ని కూడా బీజేపీలో విలీనం చేస్తారని ఆ పార్టీ అధికార ప్రతినిధి ప్రిత్పాల్ సింగ్ ప్రకటించారు. కెప్టెన్ అమరీందర్ తో పాటు ఆయన కుమారుడు, కుమార్తె, మనుమడు నిర్వాణ్ కూడా బీజేపీలో చేరుతున్నారు. అమరీందర్ సింగ్ గతేడాది కాంగ్రెస్ కు రాజీనామా చేసేశారు. ఆ తర్వాత పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. రాష్ట్రంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ, శిరోమణి అకాలీ దళ్ (సంయుక్త్)తో పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగారు. అభ్యుర్థులంతా ఓడిపోయారు.
మరో వైపు ఆయన పేరు ఉపరాష్ట్రపతి రేసులో కూడా ప్రముఖంగానే వినిపించింది. పంజాబ్ ఎన్నికల్లో ఆయన పార్టీ ఓడిపోయిన తర్వాత ఆయన ఆరోగ్యం క్షీణించింది. ఆస్పత్రిలో చేరి, చికిత్స పొందుతున్నారు. ఈ సమయంలోనే ఆయన పేరు ప్రముఖంగా వార్తల్లో కెక్కింది. బీజేపీ కూడా ఈ హామీ ఇచ్చిందని, ఆయన్ను ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటిస్తారని వార్తలు వచ్చాయి. కానీ… ఆ తర్వాత ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ధన్కర్ పేరు తెరపైకి వచ్చింది.