ఏపీ ఆర్థిక వ్యవస్థ పుష్టిగా వుంది.. ఢోకాయే లేదు : సీఎం జగన్ ప్రకటన

ఏపీ ఆర్థిక వ్యవస్థకు వచ్చిన ఢోకా ఏమీ లేదని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. కోవిడ్ సహా ఎన్నో సవాళ్లు వచ్చాయని, అయినా… రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అద్భుతంగానే వుందన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో పెట్టుబడులు, పారిశ్రామిక ప్రగతిపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడారు. అప్పులు చేస్తున్న ప్రభుత్వం ఎలా చెల్లిస్తుందని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, గోబెల్స్ ప్రచారంలో భాగంగా అబద్ధాలను నిజమని నమ్మించే ప్రయత్నం నడుస్తోందని విరుచుకుపడ్డారు. రాష్ట్రం బాగున్నా… ఓ పద్ధతి ప్రకారం తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, రాష్ట్ర జీడీపీ పెరుగుదల గతంలో కంటే బాగానే వుందని పరోక్షంగా టీడీపీని ఎద్దేవా చేశారు.

 

రుణాలకు వడ్డీల కింద 21,499 కోట్లు, రుణంగా 14,588 కోట్లు చెల్లించామని సీఎం లెక్కలు చెప్పారు. అలాగే రాష్ట్ర రెవిన్యూ 2021-22 ఆర్థిక సంవత్సరానికి 75,696 కోట్లు వచ్చిందన్నారు. 2018-19లో 5.36 శాతం ఉన్న జీడీపీ.. 6.89 శాతానికి పెరిగిందని జగన్ ప్రకటించారు. తమ ఐదేళ్ల కాలపరిమితి ముగిసే సమయానికి గత ప్రభుత్వం కంటే మెరుగైన పనితీరు కనబరుస్తామని ప్రకటించారు. సంక్షేమ పథాలు, ప్రజాకర్షక పథకాలపైనే డబ్బుులు వ్యయం చేస్తున్నామని దుష్ప్రచారం చేస్తున్నారని, మూడేళ్లలో మూలధన వ్యయం భారీ మొత్తాన్నే ఖర్చు చేశామని ఈ సందర్భంగా పేర్ంకొన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు ఈ వ్యయం ఖర్చు చేశామన్నారు. మూల ధన వ్యయం కింద 2014,19 వరకూ 76,139 కోట్లు వ్యయం చేస్తే, గడచిన మూడేళ్లలోనే తమ ప్రభుత్వం 55,086 కోట్లు ఖర్చే చేసిందని సీఎం జగన్ సభలో ప్రకటించారు.

Related Posts

Latest News Updates