దేశంలో యాక్టివ్ లేని రాజకీయ పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం ఝలక్ ఇచ్చింది. రిజిస్టర్ చేసుకొని, ఎన్నికల్లో పోటీ చేయకుండా, స్తబ్దుగా వున్న రాజకీయ పార్టీల రిజిస్ట్రేషన్ ను, సింబల్ ను రద్దు చేసింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. దేశ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ చేయించుకొని, ఎన్నికల్లో పోటీ చేయకుండా, యాక్టివ్ గా లేని 253 రాజకీయ పార్టీల రిజిస్ట్రేషన్ ను రద్దు చేసింది.
ఈ 253 పార్టీలో కే.ఏ. పాల్ సారథ్యంలోని ప్రజాశాంతి పార్టీ కూడా వుంది. తమ దగ్గర అసంఖ్యాకంగా పార్టీలు రిజిస్టర్ అయ్యాయని, కానీ… చాలా పార్టీలు ఏమాత్రం యాక్టివ్ గా లేవని, ఎన్నికల్లో పోటీయే చేయడం లేదని ఈసీ ఫైర్ అయ్యింది. ఢిల్లీ, బీహార్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో 253 యాక్టివ్‌గా లేని రాజకీయ పార్టీలు ఉన్నట్లు గుర్తించారు. కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్లు రాసిన లేఖలకు స్పందించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.