రాజధాని అమరావతి అసైన్డ్ హూముల కేసులో మాజీ మంత్రి నారాయణకు హైకోర్టులో ఊరట లభించింది. హైకోర్టు ఆయనకు ఈ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అమరావతి అసైన్డ్ మూముల్లో అవకతవకలు జరిగాయంటూ సీఐడీ అధికారులు మాజీ మంత్రి నారాయణపై కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో తనకు ఆరోగ్యం బాగో లేదని, చికిత్స చేయించుకునేందుకు అవసరమైతే విదేశాలకు వెళ్లాల్సి వుంటుందని, అందుకే ముందస్తు బెయిల్ కావాలంటూ నారాయణ తరపు న్యాయవాది ముందస్తు బెయిల్ పిటిషన్ ను దాఖలు చేశారు. దీంతో హైకోర్టు ఇరు వైపులా వాదనలు విని, నారాయణకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.