సికింద్రాబాద్ రూబీ హోటల్ అగ్ని ప్రమాదంపై పోలీసులు చురుగ్గా దర్యాప్తు చేస్తున్నారు. ఈ అగ్నిప్రమాదం కేసులో హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు నలుగుర్ని అదుపులోకి తీసుకున్నారు. హోటల్ యజమాని రాజేందర్ సింగ్ బగ్గా, సునీత్ సింగ్ బగ్గా, రూబీ హోటల్ మేనేజర్ సుదర్శన్, సూపర్ వైజర్ ను టాస్క్ ఫోర్సు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ప్రమాదంలో 8 మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ కూడా దిగ్భ్రాంతి చేశారు. ప్రధాని జాతీయ సహాయ నిధి నుంచి 2 లక్షల ఎక్స్ గ్రేషియా, చికిత్స నిమిత్తం 50 వేలు అందిస్తున్నట్లు ప్రధాని ప్రకటించారు. ఇక… తెలంగాణ ప్రభుత్వం కూడా మరణించిన వారి కుటుంబాలకు 3 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించారు.