ఢిల్లీ లిక్కర్ అవినీతి… హైదరాబాద్ తో సహా 30 ప్రాంతాల్లో ఈడీ సోదాలు

ఢిల్లీ మద్యం అవినీతిపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ విచారణ ప్రారంభించింది. హైదరాబాద్ తో సహా దేశ వ్యాప్తంగా 30 కి పైగా ప్రాంతాల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఢిల్లీ, ముంబై, బెంగళూరు. గురుగ్రామ్, లక్నో తదితర నగరాల్లో ఈ తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్ లో మూడు చోట్లు దాడులు జరిగాయి. ప్రేమ్ సాగర్, అభిషేక్ రావు తదితర ఇళ్లల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. అంతేకాకుండా కోకాపేటలోని రామచంద్ర పిళ్లై ఇంట్లో కూడా సోదాలు సరిగాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఏ14 గా రామచంద్ర పిళ్లై పేరును కూడా సీబీఐ చేర్చింది.

 

ఢిల్లీ మద్యం అవినీతిపై సీబీఐ ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా ఇంటిపై దాడులు చేసింది. దీనిపై ఆప్ తీవ్రంగా విరుచుకుపడింది. అంతర్జాతీయ మీడియా తాము ప్రవేశపెట్టిన విద్యా విధానాన్ని ప్రశంసిస్తుంటే… ఇక్కడి మోదీ ప్రభుత్వం తమపై సీబీఐ దాడులు చేస్తోందంటూ మండిపడ్డారు. ఆ తర్వాత మనీశ్ సిసోడియా బ్యాంకు లాకర్లలో కూడా సోదాలు నిర్వహించారు.

Related Posts

Latest News Updates

దిల్ రాజు ప్రెజెంట్స్, విక్టరీ వెంకటేష్, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్, అనిల్ రావిపూడి, శిరీష్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ‘సంక్రాంతికి వస్తున్నాం’- ఆర్‌ఎఫ్‌సీలో సంక్రాంతి స్పెషల్ సాంగ్ షూటింగ్