నేనేమీ అసంతృప్తిగా లేను… పుకార్లపై సీరియస్ అయిన నితిన్ గడ్కరీ

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ విమర్శకులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఏ విషయంలోనూ అసంతృప్తిగా లేనని తేల్చి చెప్పారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు నుంచి గడ్కరీని తొలగించిన తర్వాత ఆయన తీవ్ర అసంతృప్తితో వున్నారంటూ కొన్ని మీడియా ఛానెళ్లు, సోషల్ మీడియా వేదికగా కొందరు తీవ్ర ప్రచారం చేస్తున్నారు. దీనిపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తాను పూర్తి తృప్తితోనే పనిచేసుకుంటూ వెళ్తున్నానని, లేనిపోని వివాదాలు చేయవద్దని అన్నారు. తానెప్పుడూ మీడియాతో ఫ్రెండ్లీగానే వుంటానని, వాస్తవాలే చెబుతానని, అయినా… తాను అనని మాటలను అన్నట్లుగా తనకు ఆపాదిస్తున్నారని ఫైర్ అయ్యారు. ఈ మధ్య తాను మాట్లాడాని మాటలను విశ్లేషించుకోడానికి ఓ టీమ్ ను తయారు చేసుకొని, విశ్లేషించాలని, అందులో తన వ్యాఖ్యల్లో వక్రీకరణ వుంటే… ఏ శిక్షకైనా సిద్ధమేనంటూ సవాల్ విసిరారు.

 

పార్లమెంటరీ బోర్డు నుంచి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని తొలగిస్తూ పార్టీ అధిష్ఠానం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత ఆయన కొన్ని కామెంట్లు చేశారు. వాజ్ పేయి, అద్వానీ పార్టీకి పునాదులు వేశారని, ఆ పునాదులపైనే పార్టీ నడుస్తోందంటూ వ్యాఖ్యలు చేశారు. అలాగే నిర్ణయాలు తీసుకున్నా… దానిని అమలు చేయడంలో ప్రభుత్వాలు చాలా వెనకబడ్డాయంటూ వ్యాఖ్యానించారు. అయితే… గడ్కరీ ప్రస్తుత బీజేపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి, ఈ వ్యాఖ్యలు చేయలేదు. అయినా… కొందరు మోదీని టార్గెట్ గా చేసుకొనే గడ్కరీ వ్యాఖ్యలు చేశారంటూ వక్రీకరించారు.

Related Posts

Latest News Updates