భారత్- బంగ్లా మధ్య కీలక ఒప్పందాలు… కుషియారా నదీ జలాలపై ఒప్పందాలు

బంగ్లా ప్రధాని షేక్ హసీనా భారత పర్యటనకు విచ్చేశారు. రాష్ట్రపతి భవన్ లో ప్రధాని నరేంద్ర మోదీ ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి భవన్ లో షేక్ హసీనా గౌరవ వందనం స్వీకరించారు. ప్రధాని మోదీ, బంగ్లా ప్రధాని షేక్ హసీనా మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య 7 అంశాలపై ఒప్పందాలు కుదిరాయి. ముఖ్యంగా కుషియార నదీ జలాల పంపిణీ విషయంలో కీలక ఒప్పందం జరిగిందని ప్రధాని మోదీ ప్రకటించారు. ఇరు దేశాల మధ్య వాణిజ్యం వేగంగా పెరుగుతోందని, ఐటీ, అంతరిక్షం, అణుశక్తి రంగాల్లో మరింతగా సహకారం అందించుకోవాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. వీటితో పాటు విద్యుత్ పంపిణీ లైన్లపై కూడా చర్చలు జరిగాయి. భారత్ బంగ్లా సరిహద్దుల గుండా 54 నదులు ప్రవహిస్తున్నాయని, ఇవి ఇరు దేశాల ప్రజలకు జీవనాధారమని, అందుకే నదీ జలాల ఒప్పందం కుదిరిందని మోదీ అన్నారు.

 

ఈ సందర్భంగా బంగ్లా ప్రధాని షేక్ హసీనా కూడా మాట్లాడారు. భారత పర్యటనకు రావడం సంతోషంగా వుందని అన్నారు. భారత్ తమకు సహజంగా మిత్ర దేశమని, బంగ్లా విముక్తి సమయంలో భారత్ చేసిన సహాయాన్ని తామెప్పుడూ మరిచిపోలేమని గుర్తు చేసుకున్నారు. ఇరు దేశాల మధ్య సత్సంబంధాలున్నాయని ప్రకటించారు.

Related Posts

Latest News Updates