గుజరాత్ వేదికగా ”డిఫెన్స్ ఎక్స్ పో 2022” ప్రారంభం..

డిఫెన్స్ ఎక్స్ పో 2022 గుజరాత్ లోని గాంధీ నగర్ లో నేటి నుంచి ప్రారంభమైంది. 22 వ తేదీ వరకూ జరుగుతున్న ఈ ఎక్స్ పోలో ఆత్మర నిర్భర్ భారత్ లో భాగంగా తయారు చేసిన పలు రక్షణ ఉత్పత్తులను ప్రదర్శించనున్నారు. ఈ డిఫెన్స్ ఎక్స్ పోలో పాల్గొనేందుకు వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరవుతున్నారు. దాదాపు 1,340 కంపెనీలు ఇందులో పాల్గొంటున్నాయి. ఇక… 75 దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొంటున్నారు. విదేశీ కంపెనీలకు చెందిన అధికారులు సెమినార్లు, మీటింగ్ లు కూడా వుంటాయని అధికారులు తెలిపారు. ఇక.. 2025 నాటికి ఆఫ్రికాతో సహా పలు దేశాలకు 35 వేల కోట్ల ఖరీదైన ఆయుధాలను ఎగుమతి చేస్తామని రక్షణ మంత్రి రాజ్ నాథ్ కీలక ప్రకటన చేశారు.

 

ఆఫ్రికాతో సహా పలు ప్రపంచ దేశాలకు 35 వేల కోట్ల ఖరీదైన ఆయుధాలను, డ్రోన్లను ఎగుమతి చేసేందుకు భారత్ సిద్ధమైంది. ఈ విషయాన్ని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ వెల్లడించారు. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. 2025 నాటికి 35 వేల కోట్ల ఖరీదైన ఆయుధాలను ఎగుమతి చేయాలన్న లక్ష్యం పెట్టుకున్నామని, గతేడాది కూడా 13 వేల కోట్ల విలువైన ఆయుధాలను ఎగుమతి చేశామని అన్నారు. శాంతి, భద్రత, స్థిరత్వం, వృద్ధి & శ్రేయస్సు కోసం భారతదేశం ఆఫ్రికన్ దేశాలతో ఐక్యంగా ఉందని అన్నారు. 2018లో ఉగాండా పార్లమెంట్‌లో తన ప్రసంగంలో ప్రధానమంత్రి పేర్కొన్న 10 మార్గదర్శక సూత్రాలపై ఆఫ్రికాతో భారతదేశ భాగస్వామ్యం కేంద్రీకృతమై ఉందని గుర్తు చేశారు. భారత్ – ఆఫ్రికా దేశాల మధ్య రక్షణ సహకారం నిరంతరం కొనసాగుతుందని రాజ్ నాథ్ ప్రకటించారు.

Related Posts

Latest News Updates