ఉత్తరాఖండ్ లో ఘోర ప్రమాదం జరిగింది. కేదార్ నాథ్ లో ప్రయాణికులను తీసుకెళ్తున్న హెలికాప్టర్ కుప్ప కూలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు పైలట్లు, నలుగురు యాత్రికులు దుర్మరణం పాలయ్యారు. ఫటా హెలిప్యాడ్ నుంచి యాత్రికులను తీసుకెళ్తుండగా… కేదార్ నాథ్ ఆలయానికి 2 కిలోమీటర్ల దూరంలో వున్న గరుడ్ ఛాటి ప్రాంతంలో హెలికాప్టర్ కుప్పకూలిపోయింది. సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. సహాయక చర్యలు చేపడుతున్నాయి.