రైతన్నలకు శుభవార్త.. 6 రకాల పంటల కనీస మద్దతు ధరను పెంచిన కేంద్రం

దీపావళి పర్వదినం ముందు మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం దేశ రైతన్నకు గుడ్ న్యూస్ చెప్పింది. 2022-23 రబీ సీజన్ కు పలు రకాల పంటలపై కనీస మద్దతు ధరను పెంచింది. ప్రధాని మోదీ అధ్యక్షతన నేడు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలోనే ఈ కీలక నిర్ణయం తీసుకున్నారని కేంద్ర ప్రసార మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రకటించారు. రబీ సీజన్ లో ప్రధాన పంటలైన గోధుమ, ఆవాలు, శనగలు, మసూర్, బార్లీ, కుసుమ పంటల కనీస మద్దతు ధరను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారని అనురాగ్ ఠాకూర్ పేర్కొన్నారు.

 

 

– గోధుమల కనీస మద్దతు ధరను 110 రూపాయలకు పెంచారు. దీంతో క్వింటాల్ ధర 2,125 కి చేరుకుంది.

– బార్లీ ధరను 100 రూపాయలు పెంచడంతో క్వింటాల్ ధర 1735 కి పెరిగింది.

– శనగల కనీస మద్దతు ధరను 150 కి పెంచారు. దీంతో క్వింటాల్ ధర 5,335 కి చేరింది.

– మసూర్ పంట మద్దతు ధరను 500 కి పెంచారు. దీంతో క్వింటాల్ ధర 6000 కి చేరింది.

– ఆవాల కనీస మద్దతు ధరను 400 రూపాయలకు పెంచారు. దీంతో దీని కనసీ మద్దతు ధర 5,450 కి చేరింది.

– సన్ ఫ్లవర్ ధర 209 కి పెంచారు. దీంతో క్వింటాల్ 5,650 కి చేరింది.

Related Posts

Latest News Updates