ఊగిపోయిన పవన్.. ప్యాకేజీ స్టార్ అంటే చెప్పుతో కొడతానంటూ ఘాటు విమర్శలు

వైసీపీ ప్రభుత్వంపై జనసేనాని పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయారు. తనను మరోసారి ఎవరైనా ప్యాకేజీ స్టార్ అని సంబోధిస్తే.. అలాంటి వారిని చెప్పులతో కొడతానని చెప్పు చూపిస్తూ తీవ్రంగా హెచ్చరించారు. మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో పవన్ కల్యాణ్ మాట్లాడారు. ఇంకోసారి ప్యాకేజీ అంటే ఏమాత్రం బాగోదని హెచ్చరించారు. వైసీపీ గుండాల్లారా… ఒంటిచేత్తో మెడ పిసికేస్తా అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దవడలు వాచిపోయేలా కొడతానంటూ రెచ్చిపోయారు. ఇంతకాలం తన సహనమే వారిని కాపాడిందని, ఇకపై అలా వుండదన్నారు. తాను మూడు పెళ్లిళ్లు చేసుకున్నానని పదే పదే విమర్శలు చేస్తున్నారని, విడాకులు ఇచ్చిన తర్వాతే మరొకర్ని చేసుకున్నానని వివరించారు. చట్ట ప్రకారం వారికి భరణం చల్లించానని, మొదటి భార్యకు 5 కోట్లు, రెండో భార్యకు ఆస్తి ఇచ్చానని వెల్లడించారు.

 

తాను అందర్నీ గౌరవిస్తానని పవన్ స్పష్టం చేశారు. అయితే.. అవతలి వారు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇప్పటి వరకూ సహనం చూశారని, ఇకపై యుద్ధమేనని సవాల్ విసిరారు. వైసీపీలోని అందరు నేతలూ నీచులనడం లేదని, కానీ అందులో నీచుల సమూహమే ఎక్కువ అని విమర్శించారు.

 

గత 8 సంవత్సరాల్లో 6 సినిమాలు చేశానని చెప్పుకొచ్చారు. వీటి ద్వారా 100 కోట్ల నుంచి 120 కోట్లను సంపాదించుకున్నానని అన్నారు. 33 కోట్లకు పైగా పన్నులు కూడా చెల్లించానని వెల్లడించారు. వీటి తర్వాత తన వ్యక్తిగత అవసరాల నిమిత్తం డబ్బులు పక్కకు తీశానని, రెండు రాష్ట్రాల సీఎం సహాయ నిధికి 12 కోట్లు, అయోధ్య రామాలయ నిర్మాణానికి 30 లక్షలు ఇచ్చానని పవన్ వెల్లడించారు. పార్టీ పెట్టినప్పటి నుంచి బ్యాంకు ఖాతాల్లో 15.58 కోట్లు కార్పస్ ఫండ్ విరాళాలు వచ్చాయని పవన్ వివరించారు. అలాగే కౌలు రైతు భరోసా యాత్ర కోసం 3.50 కోట్లు వచ్చాయని వివరించారు.

Related Posts

Latest News Updates

నవంబర్ 9న హార్ట్‌ల్యాండ్ ఆఫ్ ఇండియా ల‌క్నోలో గ్రాండ్ లెవ‌ల్లో గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్, దిల్ రాజు కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న భారీ చిత్రం ‘గేమ్ చేంజర్’ టీజర్ రిలీజ్‌కు రంగం సిద్దం