దీపావళి సందర్భంగా అయోధ్యలో దీపోత్సవ్ వేడుకలు ఘనంగా జరిగాయి. దీప కాంతులతో అయోధ్య అంతా శోభాయమానంగా వెలిగిపోయింది. సరయూ నది ఒడ్డున 15 లక్షల మట్టి ప్రమిదల దీప కాంతులతో అయోధ్య కొత్త శోభను సంతరించుకుంది. దీపోత్సవ్ లో భాగంగా ప్రధాని మోదీ కూడా ఈ ఉత్సవంలో పాల్గొన్నారు. అయితే.. ఈ దీపోత్సవం గిన్నిస్ వరల్డ్ రికార్డులో చేరింది. దాదాపు 15,76,000 దీపాలను వెలగించడంలో 20 వేల మంది వాలంటీర్లు పాల్గొన్నారు. కేవలం సరయూ నది ఒడ్డునే కాకుండా అయోధ్యలోని ముఖ్యమైన కూడళ్లు, ప్రాంతాల్లో కూడా దీపాలను ఏర్పాట్లు చేశారు. ఇక.. బాణాసంచాను కూడా కాల్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మ్యాజికల్ లేజర్ షో అందర్నీ ఆకట్టుకుంది.
