యుద్ధం అనేది భారత్ కు చివరి అస్త్రం మాత్రమే : ప్రధాని మోదీ

ఆది కాలం నుంచి భారత్ ఎప్పుడూ యుద్ధం వైపు మొగ్గు చూపలేదని, యుద్ధాన్ని చివ్వరి అస్త్రంగా మాత్రమే వాడిన చరిత్ర భారతానిదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. యుద్ధానికి భారత్ వ్యతిరేకమని, బలం లేకుంటే.. శాంతి సాధ్యం కాదని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ తన దీపావళి పండగను కార్గిల్ లోని జవాన్లతో ఉత్సాహంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అయితే.. ఎవరైనా భారత్ పై చెడు దృష్టితో చూస్తే మాత్రం భారత్ కచ్చితంగా స్పష్టమైన సమాధానమిస్తుందని తేల్చి చెప్పారు. దేశ భద్రతకు ఆత్మ నిర్భర భారత్ చాలా ముఖ్యమైందని, విదేశీ ఆయుధాలపై ఆధారపడటం చాలా తగ్గించాలన్నారు.

 

ఇక రక్షణ వ్యవస్థలో మహిళల భాగస్వామ్యం పెరగాలని, దీని ద్వారా దేశ శక్తి సంపన్న మవుతుందని మోదీ పేర్కొన్నారు. సురక్షితమైన సరిహద్దులు, బలమైన ఆర్థి వ్యవస్థ, సమాజంలో పూర్తి విశ్వాసం వున్నప్పుడే ఈ దేశం సురక్షితంగా వుంటుందన్నారు. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా భారత గౌరవం పెరిగిందని, ఆర్థికంగానూ ఐదో శక్తిగా ఎదిగామని మోదీ పేర్కొన్నారు. అవినీతిపై నిర్ణయాత్మక పోరాటం జరుగుతోందని, అవినీతిపరులు ఎంత శక్తిమంతులైనా వదిలిపెట్టమని తేల్చి చెప్పారు.

Related Posts

Latest News Updates