అధ్యక్ష బాధ్యతలిస్తే… నమ్మకస్తుడినే సీఎం చేయాలి… గెహ్లాట్ షరతు?

రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ కాంగ్రెస్ తదుపరి అధ్యక్షుడు అవుతారని వార్తలు తీవ్రంగా వస్తున్నాయి. పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో కూడా భేటీ అవుతున్నారు. అయితే… కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు చేపడితే… సీఎం బాధ్యతలను వుంచుకుంటున్నారా? లేదా… సీఎం పదవి నుంచి తప్పుకుంటారా? అన్నది ఇప్పుడు హాట్ టాపిక్. అయితే.. దీనిపై సీఎం గెహ్లోత్ స్పందించారు. ఇంత సుదీర్ఘ ప్రయాణంలో పార్టీ తనకు అన్నీ ఇచ్చిందని చెప్పుకొచ్చారు. తనకు పదవులు ముఖ్యం కాదని, పార్టీ అప్పగించే బాధ్యతలను నిర్వర్తించడమే తన పని అని అన్నారు. పార్టీ అధిష్ఠానం గనక తనను ఆదేశిస్తే.. కచ్చితంగా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు. లేదు… ఒకవేళ సీఎంగా కొనసాగమంటే.. ఎప్పటిలాగే సీఎంగా కొనసాగుతాను అని గెహ్లోత్ క్లారిటీ ఇచ్చారు. అయితే… అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి దిగాలని తాను మరోసారి రాహుల్ ను కోరతానని వెల్లడించారు.

 

అయితే… అధ్యక్ష బాధ్యతలతో పాటు, సీఎం బాధ్యతలు కూడా చేపడతానని గెహ్లోత్ సీనియర్లతో అన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ కేవలం అధ్యక్ష బాధ్యతలకే పరిమితం కావాలని అధిష్ఠానం ఆదేశిస్తే మాత్రం… తనకు అత్యంత విశ్వాసపాత్రుడైన వారినే రాజస్థాన్ సీఎం సీట్లో కూర్చోబెట్టాలని గెహ్లోత్ శరతులు విధించినట్లు తెలుస్తోంది. లేదంటే.. సచిన్ పైలట్ చేతుల్లోకి పార్టీ వెళ్లిపోయే ఛాన్స్ వుందని గెహ్లోత్ భయపడుతున్నట్లు సమాచారం. అయితే.. మరో వార్త కూడా వస్తోంది. పార్టీ జాతీయ అధ్యక్షుడిగా గెహ్లాట్, రాజస్థాన్ సీఎంగా పైలట్ ను నియమిస్తారన్న వార్త కూడా వస్తోంది.

 

Related Posts

Latest News Updates

దిల్ రాజు ప్రెజెంట్స్, విక్టరీ వెంకటేష్, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్, అనిల్ రావిపూడి, శిరీష్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ‘సంక్రాంతికి వస్తున్నాం’- ఆర్‌ఎఫ్‌సీలో సంక్రాంతి స్పెషల్ సాంగ్ షూటింగ్