వచ్చే ఆగస్టు 15 నాటికి మరో 75 వందే భారత్ రైళ్లు

వచ్చే ఆగస్టు 15 నాటికి భారత్ లో మరో 75 వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టాలని రైల్వే శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రతి నెలా 7 లేదా 8 రైళ్లను మ్యానిఫ్యాక్చర్ చేసేలా ముందుకు సాగాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. ప్రతి కొత్త వందే భారత్ రైలులో కొంతైనా కొత్త సాంకేతికతను, అప్ గ్రేడేషన్ ను ప్రవేశపెట్టాలని రైల్వే శాఖ యోచిస్తోంది. దీని వల్ల ఖర్చులు పెరిగినా… ఆత్మ నిర్భర భారత్ కింద అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్న వారమవుతామని భావిస్తున్నట్లు తెలుస్తోంది. కపుర్తలా, రాయ్ బరేలీలోని మోడ్రన్ కోచ్ ఫ్యాక్టరీ కూడా రాబోయే 3 సంవత్సరాలలో 400 వందే భారత్ రైళ్లను తయారు చేయాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాయి. దీనికి తగ్గ పనులను కూడా ప్రారంభించింది.

 

కొన్ని రోజుల క్రితం వందే భారత్ రైలు ట్రయల్ రన్ నిర్వహించారు. కోటా-నాగ్డా సెక్ష‌న్ మ‌ద్య రైలు వేగాన్ని ప‌రీక్షించారు. టెస్ట్ ర‌న్ నిర్వ‌హిస్తున్న స‌మ‌యంలో రైలులో వాషింగ్‌, క్లీనింగ్‌తో పాటు అన్ని ప‌రిక‌రాల ప‌నితీరును ప‌రిశీలించిన‌ట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ వెల్ల‌డించారు. కోటా-నాగ్డా రూట్లో రైలు స్పీడ్ లెవ‌ల్స్‌ను టెస్ట్ చేసిన‌ట్లు మంత్రి తెలిపారు. 16 కోచ్‌ల‌తో వందేభార‌త్ రైలును ప‌రీక్షించారు.

Related Posts

Latest News Updates

నవంబర్ 9న హార్ట్‌ల్యాండ్ ఆఫ్ ఇండియా ల‌క్నోలో గ్రాండ్ లెవ‌ల్లో గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్, దిల్ రాజు కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న భారీ చిత్రం ‘గేమ్ చేంజర్’ టీజర్ రిలీజ్‌కు రంగం సిద్దం