పాకిస్థాన్కు చెందిన లష్కరే తోయిబా నేత షాహిద్ మహమూద్ను గ్లోబల్ టెర్రరిస్టుగా పరిగణిస్తూ భారత్, అమెరికా చేసిన ప్రతిపాదనను ఐక్యరాజ్యసమితిలో చైనా అడ్డుకున్నది. 1267 ఆల్ఖయిదా ఆంక్షల కమిటీ ప్రకారం ఉగ్రవాది షాహిద్పై నిషేధం విధించాలని భారత్ కోరింది. దీన్ని చైనా అడ్డుకున్నది. షాహిద్ మహబూద్ గ్లోబల్ ఉగ్రవాది అని 2016 డిసెంబర్లో అమెరికా ట్రెజరీ శాఖ ప్రకటించిన విషయం తెలిసిందే. ఉగ్రవాదులను బ్లాక్లిస్టులో పెట్టేందుకు అమెరికా, భారత్ చేస్తున్న ప్రయత్నాలను గత కొన్ని నెలల్లో చైనా అడ్డుకోవడం ఇది నాలుగవసారి.