ఆంధ్రప్రదేశ్ ఆదోని నియోజకవర్గంలో ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ నేతృత్వంలో సాగుతున్న భారత్ జోడో యాత్ర కర్నూలు జిల్లాలో రెండో రోజు సాగుతోంది. చాగి శిబిరం నుండి ఉదయం 6 గంటలకు ప్రారంభమైన యాత్ర నారాయణపురం, దనాపురం మీదుగా సాగి కల్లుబావి వద్ద టీ విరామం తీసుకున్నారు. తరువాత ప్రారంభమైన యాత్ర ఆదోని పుర వీధుల గుండా సాగింది. వివిధ వర్గాల ప్రజలతో మమేకమై రాహుల్ తన యాత్ర కొనసాగించారు. ఆదోనిలోని మహాయోగి లక్ష్మమ్మ ఆలయము సందర్శించారు. ఆలయ పూజారులు హారతి ఇచ్చారు. గట్టి భద్రత మధ్య యాత్ర సాగుతోంది. యాత్రలో ఏఐసిసి అగ్రనేతలు పాల్గొన్నారు.