‘ఛెల్లో షో’ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ రాహుల్ కోలీ లుకేమియాతో బాధపడుతూ కన్నుమూశారు. అక్టోబర్ 2న అహ్మదాబాద్‌లో క్యాన్సర్ హస్పిటల్లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు రాహుల్ తండ్రి రాము కోలీ తెలిపారు.సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. గుజరాతీ సినిమా ‘ఛెల్లో షో’ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ రాహుల్ కోలీ కన్నుమూశారు. గత కొంతకాలంగా లుకేమియాకు క్యాన్సర్ ఇనిస్టిట్యూట్‌లో చికిత్స పొందుతున్న రాహుల్.. అక్టోబర్ 2న అహ్మదాబాద్‌లో మరణించారు. ఈ ఏడాది ఆస్కార్ అవార్డు ఎంట్రీ కోసం భారత్ నుంచి గుజరాతీ చిత్రం ‘ఛెల్లో షో’ మూవీని ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా అక్టోబర్ 14న విడుదల కానుండగా.. మూవీ రిలీజ్‌కు ముందే రాహుల్ మరణించడం సినీ లోకాన్ని విషాదంలో ముంచింది.రాహుల్ కోలీ తండ్రి రాము కోలి ఆటో రిక్షా నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ‘ఛెల్లో షో’ రిలీజ్ అయిన తరువాత మన జీవితాలే మారిపోతాయని రాహుల్ అంటుంటేవాడని తండ్రి కన్నీరు మున్నీరవుతున్నారు. రాహుల్ ట్రీట్మెంట్ కోసం ఆయన తనకున్న రిక్షాను అమ్మేశారు. ఈ విషయం ‘ఛెల్లో షో’ మూవీ టీమ్‌కు తెలియడంతో తిరిగి ఇప్పించారు.అక్టోబర్ 2న అల్పాహారం తీసుకున్న రాహుల్.. జ్వరం వచ్చిన తర్వాత మూడుసార్లు రక్తాన్ని వాంతులు చేసుకున్నాడని తండ్రి రాము కోలీ తెలిపారు. ఆ తరువాత వెంటనే తన బిడ్డ లోకాన్ని విడిచిపెట్టిపోయాడని కన్నీళ్లు పెట్టుకున్నారు. ‘ఛెల్లో షో’ని కలిసి అక్టోబర్ 14న కుటుంబం మొత్తం కలిసి చూస్తామన్నారు. ‘ఛెల్లో షో’ మూవీలో ప్రధాన పాత్ర పోషించిన మొత్తం ఆరుగురు చైల్డ్ ఆర్టిస్టుల్లో రాహుల్ కోలీ ఒకరు.