గుంటూరులో ‘రైల్వే కోచ్ రెస్టారెంట్’ ప్రారంభం…

ఎప్పటికప్పుడు ప్రయాణికులను ఆకర్షించేందుకు దక్షిణ మధ్య రైల్వే తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా ప్రయాణికుల సౌకర్యార్థం ”రైల్వే కోచ్ రెస్టారెంట్” ను గుంటూరు రైల్వే స్టేషన్ లో అందుబాటులోకి తెచ్చింది. గుంటూరు రైల్వే స్టేషన్ లో ఈ రెస్టారెంట్ ను దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రారంభించారు. రైలు పట్టాలను ఏర్పాటు చేసి, వాటిపై స్లీపర్ కోచ్ ను పూర్తి ఏసీ సదుపాయంతో రెస్టారెంట్ గా అధికారులు దీనిని డిజైన్ చేశారు.

 

 

ఏపీలో రైల్వే కోచ్ రెస్టారెంట్ ఇదే మొదటిదని రైల్వే అధికారులు ప్రకటించారు. పరిశుభ్రమైన, నాణ్యతతో ఆహారాన్ని అందిస్తున్నామని, ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని రైల్వే సూచించింది. గుంటూరు రైల్వే స్టేషన్ మీదుగా ప్రయాణించే ప్రయాణికుల కోసం ఈ రెస్టారెంట్ 24 గంటల సేవలు అందుబాటులో వుంటాయని రైల్వే అధికారులు ప్రకటించారు.

 

Related Posts

Latest News Updates