సెంట్రల్ విస్టా ముస్తాబు

సెంట్రల్‌ విస్టా అవెన్యూ సందర్శకుల కోసం ముస్తాబైంది. విజయ్‌ చౌక్‌ నుంచి ఇండియా గేట్‌ వరకు ఉన్న మార్గాన్ని ప్రధాని మోదీ ఈ నెల 8న ప్రారంభించనున్నారు. దాదాపు 20 నెలల తర్వాత సందర్శకుల కోసం ఈ మార్గం తెరుచుకోనుంది. రాజ్‌పథ్‌వైపు సెంట్రల్‌ విస్టాలో అన్ని హంగులు సిద్ధమయ్యాయి. రాష్ట్రాల వారీగా ఫుడ్‌స్టాల్స్‌, చుట్టూ హరిత శోభిత రెడ్‌ గ్రానైట్‌ వాక్‌వేలు, వెండిరగ్‌ జోన్‌లు, పార్కింగ్‌ స్థలాలు ఉంటాయి. ఇక్కడ 24 గంటలు సెక్యూరిటీ కొనసాగుతుంది. అయితే ఇండియా గేట్‌ నుంచి మూన్‌సింగ్‌ రోడ్‌ వరకు గార్డెన్‌ ఏరియాలో సందర్శకులు ఆహారం తీసుకురావడం నిషేధం. ప్రాజెక్ట్‌ ఎగ్జిక్యూటింగ్‌ ఏజెన్సీ అయిన సీపీడబ్ల్యుడీ ఐదు వెండిరగ్‌ జోన్‌లను ఏర్పాటు చేసింది. ఇండియా గేట్‌కు సమీపంలో రెండు బ్లాక్‌లు ఉండగా, ఒక్కో బ్లాక్‌ లో ఎనిమిది దుకాణాలు ఉంటాయని, కొన్ని రాష్ట్రాలు తమ ఫుడ్‌ స్టాల్స్‌ను ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపుతున్నాయని ప్రాజెక్టు సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు.

ఐస్‌క్రీమ్‌ ట్రావీలను రోడ్లపైకి అనుమతించకుండా చూస్తామమని అధికారి తెలిపారు. కొత్తగా ఏర్పాటు చేసిన సాకర్యాలను ఎలాంటి నష్టం జరగకుండా భారీగా పోలీసు సిబ్బంది, 80 మంది సెక్యూరిటీ గార్డులు మోహరిస్తారు. మొత్తం కాల్వ విస్తీర్ణంలో 19 ఎకరాలను పునరుద్ధరించారు. వాటికి ఏరియేటర్ల వంటి మౌలిక సదుపయాలు కల్పించారు. మొత్తం 16 వంతెనలు ఉన్నాయి. రెండు కాలువలలో బోటింగ్‌ అనుమతిస్తారు. నగరంలో అత్యంత ప్రజాదరణ పొందిన పబ్లిక్‌ స్పేస్‌గా పరిగణించబడుతున్న రాజ్‌పథ్‌కు ప్రజలు భారీగా వస్తారని, పరిశుభ్రతను కాపాడుకోవడం సవాలుగా మారుతుందని ప్రాజెక్టు అధికారి తెలిపారు.

Related Posts

Latest News Updates