సీఎం కేసీఆర్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆహ్వానం

కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహిస్తున్న తెలంగాణ విమోచన దినోత్సవాల్లో అతిథిగా పాల్గొనాలంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆహ్వానించారు. ఈ మేరకు ఆయన సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. తెలంగాణ గడ్డపై స్వాతంత్ర్య వజ్రోత్సవాలను (75 ఏళ్ల సంబరాలు) ఘనంగా నిర్వహించాలని కేంద్ర సాంస్కృతిక శాఖ నిర్ణయించింది. ఇందులో భాగంగా సెప్టెంబర్ 17న హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ప్రత్యేక ఉత్సవాల కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కిషన్‌రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరవుతారు. గౌరవ అతిథులుగా హాజరు కావాలని కోరుతూ కేసీఆర్‌తో పాటు మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే, కర్ణాటక సీఎం బస్వరాజ్ బొమ్మైలకు కూడా కిషన్ రెడ్డి లేఖలు రాశారు.

Related Posts

Latest News Updates