రైల్వే ఉద్యోగులకు దీపావళి కానుక.. చమురు కంపెనీలకు వన్ టైం గ్రాంట్.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు

నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం దీపావళి కానుకగా రైల్వే ఉద్యోగులకు బోనస్ ప్రకటించింది. ఇది పని ఆధారిత బోనస్ అని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నేడు కేంద్ర కేబినెట్ భేటీ జరిగింది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మొత్తం 11.27 లక్షల మంది రైల్వే ఉద్యోగులు గరిష్ఠంగా 17,951 రూపాయలను పొందుతారని కేంద్ర మంత్రి వివరించారు. నాన్ గెజిటెడ్ రైల్వే ఉద్యోగులకు పర్ఫ్మార్మెన్స్ ఆధారంగా ఇంన్సెటివ్ ఇస్తామని పేర్కొన్నారు.

 

 

ప్రపంచవ్యాప్తంగా ఎల్‌పీ‌జీ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో సామాన్యులపై ఆ ప్రభావం పడకుండా పబ్లిక్ సెక్టార్‌లోని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు 22 వేల కోట్ల రూపాయలు వన్ టైమ్ గ్రాంట్‌గా ఇవ్వాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. మల్టీ స్టేట్ కో ఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ 2002ను సవరిస్తూ మల్టీ స్టేట్ కో ఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ 2022కు కూడా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే ప్రైమ్ మినిస్టర్ డెవెలప్‌మెంట్ ఇనీషియేటివ్ ఫర్ నార్త్ ఈస్ట్ రీజియన్ అనే కొత్త పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రకటించారు.

Related Posts

Latest News Updates