వైవిధ్యమైన పాత్రలతో తనదైన గుర్తింపు సంపాదించుకున్న నందమూరి కథానాయకుడు.. డైనమిక్ స్టార్ నందమూరి కళ్యాణ్ రామ్. రీసెంట్‌గా విడుదలైన బింబిసార చిత్రంతో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్‌ను సాధించిన కళ్యాణ్ రామ్ హీరోగా ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. నందమూరి కళ్యాణ్ రామ్ 19వ చిత్రమిది. రాజేంద్ర రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మిస్తున్నారు. కళ్యాణ్ రామ్ సరసన ఆషిక రంగనాథ్ హీరోయిన్‌గా నటిస్తోంది. రీసెంట్‌గా జరిగిన గోవా షెడ్యూల్‌తో దాదాపు సినిమా పూర్తయ్యింది. చివరి షెడ్యూల్ త్వరలోనే ప్రారంభం కానుంది. జిబ్రాన్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి ఎస్.సౌందర్ రాజన్ సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేశారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను తెలియజేస్తామని చిత్ర యూనిట్ తెలియజేసింది.