ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలన్నీ పరిష్కరిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రటకించారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలన్నదే తమ అభిమతమని, అందుకే ఎప్పటికప్పుడు సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. పీఆర్సీలో మరికొన్ని అంశాలు పెండింగ్ లో వున్నాయని, వాటిని కూడా త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
సీపీఎస్ అంశంలో తామిచ్చిన ఎన్నికల హామీల్లో అదొక్కటని, ఆ హామీని నెరవేర్చేందుకే ప్రయత్నిస్తామని తెలిపారు. అందుకే ఉద్యోగ సంఘాల నేతలతో పలు దఫాలుగా చర్చిస్తున్నామని బొత్స క్లారిటీ ఇచ్చారు. అయితే.. సీపీఎస్ రద్దు చేసేందుకు ప్రభుత్వానికి ఆర్థికపరమైన ఇబ్బందులు వున్నాయని అన్నారు. ఉద్యోగుల సంక్షేమం గురించి ఆలోచించి, సీపీఎస్ కంటే మెరుగైన విధానాన్ని అమలు చేసేందుకు ప్రయత్నిస్తామని బొత్స పేర్కొన్నారు.